-->

ACM తో సహా ముగ్గురు మావోయిస్టులు ఒక సానుభూతిపరుడి అరెస్టు

ACM తో సహా ముగ్గురు మావోయిస్టులు ఒక సానుభూతిపరుడి అరెస్టు

 ACM తో సహా ముగ్గురు మావోయిస్టులు ఒక సానుభూతిపరుడి అరెస్టు

తేదీ 25.07.2024న దామరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులలో తప్పించుకొని పారిపోయిన నిషేధిత మావోయిస్టుల ఆచూకీ కోసం గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని దామరతోగు అటవీ ప్రాంతంలో నలుదిక్కులా పోలీసు బలగాలను మోహరించి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. 

దామరతోగు గ్రామానికి దక్షిణాన గల అటవీ ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ రోజు అనగా తేదీ 01.08.2024 తెల్లవారుజామున సుమారు 06.30 గంటల ప్రాంతంలో ముగ్గురు మగ వ్యక్తులు మరియు ఒక ఆడ వ్యక్తి పోలీసు వారిని గమనించి దాక్కునేందుకు ప్రయత్నిస్తూ అనుమానాస్పదంగా కనిపించినారు. 

వారిని పట్టుకుని విచారించగా వారిలో ఇద్దరు మగ వ్యక్తులు మరియు ఒక ఆడ వ్యక్తి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యులని, మరొక మగ వ్యక్తి గుండాల మండలం దామరతోగు గ్రామానికి చెందిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడని తేలింది.

పట్టుబడిన వారి వివరాలు:

1) పొట్టం రాజు @ జోగా, తండ్రి పేరు పాండు, వయసు 25 సంవత్సరాలు, ఇతనిది ఛత్తీస్గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా కుట్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని గొండ్ర గ్రామం. ఇతను 2016 వ సంవత్సరం నుంచి నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో DKSZC లోని దక్షిన్ బస్తర్ డివిజన్ లో 2nd సెంట్రల్ రీజినల్ కంపెనీలో దళ సభ్యునిగా చేరినాడు. 2022లో ACM గా ప్రమోషన్ పొందినాడు. ఇతను INSAS తుపాకిని కలిగి ఉన్నాడు. తెలంగాణ, చత్తీస్గద్ రాష్ట్ర మావోయిస్టు పార్టీ సాయుధ దళ సభ్యులతో కలిసి తెలంగాణ మరియు చత్తీస్గడ్ రాష్ట్రాల్లో దాదాపు 42 హింసాత్మక సంఘటనలలో పాల్గొన్నాడు.

ఇతని వద్ద నుండి ఒక Insas మారణాయుధాన్ని, దానికి సంభంధించిన 29 రౌండ్లు గల రెండు లోడెడ్ మార్డెన్స్ మరియు పౌచ్ మరియు ఆలీవ్ గ్రీన్ కలర్ యూనిఫోర్మ్ స్వాదీనం చేసుకోవడమైనది.

2) ఓయం పాండు ( రమేష్, తండ్రి పేరు జగ్గు, వయసు 25 సంవత్సరాలు, ఇతనిది ఛత్తీస్గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా బైరాంఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోల్నార్ గ్రామం. ఇతను డిసెంబర్ 2021 వ సంవత్సరం నుంచి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో DKSZC లోని దక్షిన బస్తర్ డివిజన్ లో 2nd సెంట్రల్ రీజినల్ కంపెనీలో దళ సభ్యుడిగా చేరినాడు. తెలంగాణ, చత్తీస్గద్ రాష్ట్ర మావోయిస్టు పార్టీ సాయుధ దళ సభ్యులతో కలిసి తెలంగాణ మరియు చత్తీస్గడ్ రాష్ట్రాల్లో 19 హింసాత్మక సంఘటనలలో పాల్గొన్నాడు.

ఇతని వద్ద నుండి ఆలీస్ గ్రీన్ కలర్ యూనిఫోర్మ్, 12 రౌండ్లు 303, రెండు చార్జర్ క్లిప్పులు మరియు పౌచ్ స్వాధీనం చేసుకోవడమైనది.

3) పూనెం చుక్కి @ తేజ @ జోగి, తండ్రి పేరు గంగ, వయసు 27 సంవత్సరాలు, ఈమెది తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా, దూదేకులపల్లి గ్రామం.ఈమె మే 2023 వ సంవత్సరం మంచి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో తెలంగాణ రాష్ట్రం ఏటూరునాగారం- మహాదేవపూర్ ఏరియా కమిటీలో దళ సభ్యురాలిగా చేరింది. మావోయిస్టు పార్టీ సాయుధ దళ సభ్యులతో కలిసి తెలంగాణ మరియు చత్తీస్గడ్ రాష్ట్రాల్లో (03) హింసాత్మక సంఘటనలలో పాల్గొన్నది.

ఈమె వద్ద నుండి ఒక గొడ్డలి ని స్వాదీనం చేసుకోవడమైనది.

4) శ్యామల ముఖేష్, తండ్రి పేరు భీమయ్య, 19 సంవత్సరాలు, ఇతనిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం, దామరతోగు గ్రామం. ఇతను గత కొంతకాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సానుభూతి పరుడుగా పనిచేస్తున్నాడు.

ఇతని వద్ద నుండి మావోయిస్ట్ పార్టీకి చెందిన కరపత్రాలు స్వాదీనం చేసుకోవడమైనది. వీరు ముగ్గురు మావోయిస్టులు మరియు సానుభూతిపరుడైన ముకేష్, ఇతర సానుభూతిపరులతో కలిసి దామరతోగులో సభలు సమావేశాలు నిర్వహించి జిల్లాలో పార్టీ పునర్నిర్మాణం చేయాలని అమరవీరుల త్యాగాలను అందరికీ తెలిసేలా చాటింపు వేయాలని చర్చిస్తున్న సమయంలో పోలీసువారు వారిని పట్టుకుని విచారించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. 

ఇట్టి తీవ్రవాదులపై గుండాల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయబడినది. వీరిపై తదుపరి చట్టపరమైన చర్యలు చట్టబద్దంగా తీసుకోవడం జరుగుతుంది. అజ్ఞాతంగా నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సభ్యులు మరియు నాయకులు స్వచ్ఛందంగా తమంతట తాముగా జనజీవన స్రవంతిలో

కలవాల్సిందిగా తెలంగాణా ప్రభుత్వం తరుపున పోలీస్ శాఖ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి గౌరవప్రదమైన తగిన పునరావాసం తెలంగాణా ప్రభుత్వం కలిపించడానికి సిద్దంగా ఉంది. మావోయిస్టు పార్టీ కాలం చెల్లిన సిద్ధాంతాలతో విప్లవం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ,

మాయ చేస్తూ, అమాయకుల వద్ద నుండి చందాల రూపంలో దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా నిరాకరించిన వారిని పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో, ప్రజాద్రోహులుగా ముద్రవేసి హతమార్చడం పరిపాటిగా మారింది.

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహకరిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, అమాయకపు ఆదివాసీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకునే వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Blogger ఆధారితం.