మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంద హనుమంతు
మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంద హనుమంతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్టఆఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంద హనుమంతు ఆధ్వర్యంలో మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు ఆర్పించారు. అనంతరం మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. స్వీట్స్ పంచిపెట్టి, బాణాసంచా కాల్చి, డప్పుల దరువుతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగల గుండె చప్పుడు మంద కృష్ణ మాదిగ, ముపై ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితం నేటితో సహకారం. అయిందన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలపూరి ధర్మరాజు, జమలయ్య, లక్ష్మణ్, అందేల ఆనందరావు, నాయకులు కుసపాటి శ్రీను, మోరే భాస్కర్, పాలేపు దుర్గేష్, కనుకుంట్ల శ్రీను, నల్ల శ్రీను, సలిగంటి శ్రీను, బొమ్మెర శ్రీనివస్, మాట్లా గాయత్రి, కనుకుంట్ల రాములమ్మ, ఈదునూరి నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment