-->

పాల నురగలు లాగా నీరు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత

 

పాల నురగలు లాగా నీరు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత

పాల నురగలు లాగా నీరు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.

కొన్ని సంవత్సరాలుగా లేని జలసవ్వడి.. ఇప్పుడు అద్భుత సోయగం..... పాల నురగలు లాగా నీరు....నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.

నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుండటంతో… సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ కు భారీగా ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.. దీంతో సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారు.. నాగార్జునసాగర్‌కు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో మొదట ఆరు గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది.. నాగర్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు

 ఒకొక్క గేట్ నుండి 5 వేలు.. మొత్తం 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతోన్న అధికారులు.. సాయంత్రం వరకు 6 లేదా 8 గేట్లు ఎత్తి.. స్పీల్ వే ద్వారా 2 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే అవకాశం.. నల్లగొండ, సూర్యాపేట, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలను అప్రమత్తం అధికారులు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793