ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధార్ పార్టీ అధ్యక్షులు కంటే కేశవ్ . ఆదివాసీ నాయకులు వాడే వీరస్వామి.. ఆర్ ఎం ప్రశాంత్.జాతీయ ఆదివాసీ అభ్యుదయ సంఘం భద్రాచలం మండల అధ్యక్షులు నూపా శ్రీరామ్
ఈ నెల 9న జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వాడ వాడలా ఘనంగా నిర్వహించాలని జాతీయ ఆదివాసీ అభ్యుదయ సంఘం భద్రాచలం మండల అధ్యక్షులు నూపా శ్రీరామ్ పిలుపునిచ్చారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలను భావి తరాలకు అందించాలని అన్నారు. ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన అసలైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. జీవో నెం.3ని రద్దు చేయాలని, ఉద్యోగాల భర్తీలో స్థానిక ఆదివాసీలకే పెద్దపీఠ వేయాలని కోరారు.
ఏజన్సీలో ఆదివాసీ చట్టాలను పకడ్భందీగా అమలు చేసి, అసలైనా ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పూనం నరేష్. ఓకే ముత్తయ్య దొర. సోమరాజు, మర్మం చిట్టిబాబు, బొడికె గణేష్, వెంకటేష్, రాధ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment