స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, చైర్ పర్సన్, కమిషనర్
స్వచ్ఛదనం పచ్చదనం మనందరి బాధ్యత జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం పచ్చదనం 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు 5 రోజుల వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 6వ వార్డు రామవరం నందు గౌరవ భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరు కావడం జరిగింది. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనంతో అన్ని గ్రామాలు అన్ని పట్టణాలు రూపొందాలంటే ముందుగా ప్రజలందరూ స్వచ్చందంగా వారి వారి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో తమ వంతుగా పూర్తి బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది
అట్టి అవగాహన ప్రజలందరిలో కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపు మేరకు అధిక సంఖ్యలో స్వచ్చందంగా పాల్గొన్న వార్డు ప్రజలను అభినందించారు.
అనంతరం చాలా రోజుల నుండి పిచ్చిమొక్కలతో నిండి ఉన్న ఖాళీ ప్రదేశాన్ని స్వయంగా కలెక్టర్, చైర్మన్, కమిషనర్ శేషాంజన్ స్వామి, మేనేజర్ ప్రసాద్ రవి బాబు, DE రవి కుమార్, కొత్తగూడెం మునిసిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ అర్జున్ రావు, సింగరేణి AGM రామకృష్ణ, మునిసిపల్ మరియు సింగరేణి పారిశుద్ధ్య కార్మికులు, వార్డు ప్రజలు కలిసి శుభ్రం చేశారు. ఎంతో చైతన్యంతో శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న వార్డు ప్రజల సహకారానికి, స్పందనకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
శుభ్రం చేసిన ఖాళీ స్థలంలో పూర్వం గ్రంధాలయం ఉండి విద్యార్థిని విద్యార్థులకు అత్యంత ఉపయోగకారిగా ఉండేదని, గ్రంధాలయం మూతపడిన తరువాత నిరుపయోగంగా, పిచ్చిమొక్కలు, చెత్తకుప్పల నిలయంగా మారిందని, కావున కలెక్టర్ చొరవ తీసుకొని సింగరేణి యాజమాన్యం వారితో మాట్లాడి వీలైనంత త్వరగా ఈ ఖాళీ ప్రదేశంలో గ్రంధాలయం కానీ, అంగన్వాడీ కేంద్రం కానీ నిర్మాణం జరిగే విధంగా చర్యలు చేపట్టగలిగితే రామవరంలోని 6వ వార్డు ప్రజలకు అత్యంత మేలు జరుగుతుందని చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కలెక్టర్ కి విజ్ఞప్తి చేయగా, కలెక్టర్ ఇట్టి విషయమై సింగరేణి యాజమాన్యంతో చర్చించి తగు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ టీచర్లకు కలెక్టర్ ప్రతి ఒక అంగన్వాడీ కేంద్రాల్లో మెడిసినల్ ప్లాంట్స్ ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశిస్తూ కలెక్టర్ గారు చైర్మన్ కలిసి అంగన్వాడీ టీచర్లకు లెమన్ గ్రాస్ మొక్క ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యల పట్ల త్వరితగతిన స్పందించే కలెక్టర్ కి చైర్మన్ మరియు వార్డు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వార్డు ప్రజలకు చైర్మన్ కాపు సీతాలక్ష్మి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
శ్రమదాన కార్యక్రమం అనంతరం వార్డులో అవగాహన ర్యాలీతో పాటుగా తడి పొడి చెత్త నిర్వహణపై వార్డులోని కుటుంబాలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో 2టౌన్ CI రమేష్, మునిసిపల్ శానిటరి ఇన్స్పెక్టర్ అశోక్ చౌహాన్, జవాన్ రాజేష్, సింగరేణి సుపర్వైజర్ శ్రీనివాస్, RPలు, అంగన్వాడీలు, ANMలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు..

Post a Comment