30 లక్షలతో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబాశివరావు 25వ వార్డ్ లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసినారు. 30 లక్షలతో కమ్యూనిటీ హాల్ ను అతి తొందరగా కట్టి వినియోగంలోకి తీసుకు రావాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్ ని కోరినారు. స్థానిక కౌన్సిలర్ సాహెరా బేగం మాట్లాడుతూ ఎప్పటి నుండో పెద్దలు బస్తీ కోసం ఆపిన స్థలం లో కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసిన ఎమ్మెల్యే కి ధన్యవాదములు తెలిపినారు.
మాజి కౌన్సిలర్ మొహ్మద్ యూసుఫ్ మాట్లాడుతూ పేదల పక్ష పాతి, అసంగటిత కార్మికుల నాయకులు మన ఎమ్మెల్యే అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం ప్రకారం 45 సంవత్సరాల నుండి సిపిఐ పార్టీ లో అంచెలంచే లుగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా ఏదిగారన్నరు. 100 సంవత్సరాల సిపిఐ పార్టీ లో కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో మేము సిపిఐలో చేరినందుకు గర్వపడుతున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్, మున్సిపల్ ఛైర్పర్సన్ సీతా లక్ష్మి, mro, ఎలక్ట్రికల్ ad, మున్సిపల్ డిఇ, స్థానిక బస్తీ పెద్దలు అబ్దుల్ రెహమాన్, రోహిణి నాధ్, బండారి రాములు, కటుకూరి ఆనంద్, దామెర కుమార్, రాయాలింగు, sd. Afzal, sd. ఉస్మాన్, md. మౌలానా, నదీమ్, సలీం, తేజ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment