రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ ఆహారంపై మంత్రి కీలక వ్యాఖ్యలు
బిర్యానీ నుంచి షవర్మా వరకు కల్తీనే.. మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ల లో కల్తీ ఆహారంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ ఆహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. బిర్యానీ నుంచి షవర్మా వరకు కల్తీ అవుతోందని అన్నారు.
ఈ క్రమంలోనే తమ సర్కార్ అప్రమత్తమై రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఇన్‌స్పెక్షన్ల ను పెంచామని.. ఇంకా పెంచుతామని ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

Post a Comment