పోలీసు బ్యాడ్జీల్లో మార్పు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పోలీసు బ్యాడ్జీ ల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఇటీవల టీఎస్ ఉన్న పేరును టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీనిలో భాగంగా పోలీసు బ్యాడ్జీల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. బ్యాడ్జీల్లో ఏ విధంగా లోగో ఉండాలో సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
టీఎస్పీ స్థానంలో టీజీపీ, తెలంగాణ స్టేట్ పోలీసు స్థానంలో తెలంగాణ పోలీసు, టీఎస్ఎస్పీ స్థానంలో టీజీఎస్పీ, టీఎస్పీఎస్ స్థానంలో టీజీపీఎస్ ఉండే విధంగా బ్యాడ్జిలను రూపొందించారు.

Post a Comment