పొట్ట కూటికి కోసం వెళ్లి అనంతలోకాలకు
కోదాడ....పొట్ట కూటికి కోసం వెళ్లి చెట్టు మొద్దు మీద పడి తిరిగి రాని లోకాలకు వెళ్లిన విషాదకర సంఘటన కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
స్ధానికుల సమాచారం మేరకు జక్కంపూడి కొండయ్య (52) చెట్లు కోసే కూలి పని కి వెళ్లాడు. చెట్లు కోస్తున్న సమయంలో చెట్టు విరిగి మీద పడిపోయింది
ఈ ఘటన లో కొండయ్య కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Post a Comment