క్రైస్తవులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఆర్.ఎస్.జె థామస్
తెలంగాణ రాష్ట్రంలో జై స్వరాజ్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేయబడిన పత్రిక ప్రకటన విషయమై జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.జె థామస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా క్రైస్తవుల పైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఒక్క పార్టీ కూడా కనపడటం లేదు.
క్రైస్తవుల్లో నాయకత్వాన్ని పెంపొందించే విధంగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు కూడా కనబడటం లేవని కేంద్ర ప్రభుత్వాలను ఎద్దేవా చేశారు. దేశంలో మణిపూర్ లో జరిగిన ఘటన తర్వాత క్రైస్తవుల పైన విపరీతమైన దాడులు పెరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల క్రైస్తవులను రక్షించి వారిపైన దాడులు చేస్తున్న వారి పైన కఠిన చర్యలు తీసుకునే చిత్తశుద్ధి లేని పరిస్థితి కనిపిస్తుంది.
నామమాత్రపు క్రైస్తవులుగా పిలవబడుతున్న వారికి అవకాశాలు ఇస్తూ నిజమైన క్రైస్తవ సమాజ సంక్షేమం నిమిత్తం పోరాడుతున్న నాయకులను గౌరవించలేని పరిస్థితిలో అధికార పార్టీ నాయకులు ఉన్నారు. క్రైస్తవ సామాజికపరంగా దళిత హోదాను రద్దుచేసి బీసీ-సీ గా ఇచ్చినప్పటికీ, 1% బీసీ-సీ రిజర్వేషన్ ను జనాభా ప్రతిపాదికన BC-C క్రైస్తవులకు 10% రిజర్వేషన్ ప్రకటించాలని జై స్వరాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.
చట్టపరంగా బీసీ-సీ క్రిస్టియన్ అని నిరూపించుకున్న క్రైస్తవులకు మైనార్టీలో ప్రత్యేకమైనటువంటి స్థానాలు కల్పించి, ప్రత్యేక నియోజకవర్గం ప్రకటించాలని, క్రైస్తవులకు ప్రత్యేక నియోజకవర్గంలను ప్రకటిస్తామని జై స్వరాజ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.జె థామస్ తెలియజేశారు.

Post a Comment