స్కూల్ బస్సు బోల్తా పడి విద్యార్థులకు గాయాలు
నాగర్ కర్నూల్: స్కూల్ బస్సు అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ను ఢీకొని, స్కూల్ బస్సు బోల్తా పడి కొంత మంది విద్యార్థులకు గాయాలు అయినట్టు తెలుస్తుంది,
ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లోని కొట్టెం గ్రామ శివారులో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది, 20 మంది స్కూల్ విద్యార్థులతో వెళుతుండగా, ట్రాక్టర్ను ఢీకొట్టి పంట పొలంలోకి దూసుకెళ్లి స్కూల్ బస్సు బోల్తా పడింది,
ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘట నకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది..

Post a Comment