కె మాన్వితకు సిపిఐ, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు ఘన సన్మానం
సింగరేణి చరిత్రలోనే పబ్లిక్ సెక్టర్లు ఇండి విజిల్ విభాగంలో రజక పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన కె మాన్వితకు సిపిఐ, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు (నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్) ఆధ్వర్యంలో ఘన సన్మానం.
16/10/202 నుండి 18/10/2024 వరకు మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ జరిగినటువంటి ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ అథ్లెటిక్ మీట్ 2024-25 లో షాట్‌పుట్ మరియు డిస్కస్ త్రో లో కె.మాన్విత రెండు సిల్వర్ మెడల్ సాధించింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కార్పొరేట్ లోని ఎస్టేట్ విభాగంలో ఉద్యోగం చేస్తూ చిన్ననాటి నుండి క్రీడారంగంలో ముందంజలో ఉంటూ ఎన్నో పథకాలు సాధించిన మన్విత మరెన్నో పథకాలు సాదించాలని శేషగిరి భవన్లో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది,
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉన్న లక్ష్మి కుమారి, జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, ఆర్గనైజ్ సెక్రెటరీ కరిష రత్నకుమారి, కార్యవర్గ సభ్యులు ఎం ధనలక్ష్మి, మేదిని లక్ష్మి, భాగ్యలక్ష్మి, పాలమూరు ధనలక్ష్మి, మద్దెల విజయలక్ష్మి, శాంతి, వీణ, సంఘమిత్ర, అనసూర్య, లత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment