సీఎం సభ సజావుగా జరిగేలా చర్యలు: సీపీ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్బంగా సోమవారం రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారులతో పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పని చేసి సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Post a Comment