-->

గెజిటెడ్ ఉద్యోగం సాధించిన యువతీ! సన్మానించిన గ్రామస్తులు

గెజిటెడ్ ఉద్యోగం సాధించిన యువతీ! సన్మానించిన గ్రామస్తులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, ఉల్వనూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బర్ల లక్ష్మణరావు- సరోజ దంపతుల కుమార్తె బర్ల వసుంధర తెలంగాణ ప్రభుత్వం TGPSC ద్వారా నిర్వహించిన AEE పరీక్షలో మంచి ర్యాంకు సాధించి మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉద్యోగం పొందింది. 

ప్రస్తుతం భద్రాచలంలో జూనియర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ విషయం గుర్తించిన  గ్రామ పెద్దలు, మహిళలు,యువకులు బర్ల వసుంధరను సోమవారం అభినందించి ఘనంగా సన్మానించారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. చిన్నప్పటినుండి క్రమశిక్షణతో చదువుకొని కష్టపడి ఉద్యోగం సాధించడం గ్రామానికి గర్వకారణమని చెప్పారు. 

అలాగే యువకులు కష్టపడి చదువుకుంటే సాధించలేని ఏమీ లేదని చెప్పారు. పేదరికంలో కూడా కష్టపడి చదివించిన తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రవి రమేష్, వెంకట్రావు, రోజా, సుమలత తదితరులు పాల్గొన్నారు.

.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793