నిందితునికి రెండేళ్ల జైలు శిక్ష: కొత్తగూడెం కోర్టు తీర్పు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, నిందితునికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు.
కేసు నేపథ్యం:
2017 ఏప్రిల్ 1న బందగిరి నగర్‌కు చెందిన పూనేం పాపారావు కుమారుడు సురేష్, అతని స్నేహితుడు లోడిగె బుచ్చి రాములు మోటార్ సైకిల్‌పై వెంకటాపురం వెళుతుండగా, కరకగూడెం మండలం మద్దెలగూడెం వద్ద అపశ్రుతి జరిగింది. సురేష్ తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే మరణించాడు. బుచ్చి రాములకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూనేం పాపారావు తన కుమారుడి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 2న కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ ఈ. రాజ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు:
పోలీసులు దర్యాప్తులో నిందితులుగా బందగిరి నగర్‌కు చెందిన నూపురాం, నూప సతీష్‌లను గుర్తించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 11 మంది సాక్షులును విచారించిన కోర్టు, మొదటి నిందితుడు నూపురాం మృతిచెందడంతో అతనిపై కేసును కొట్టివేసింది. పోస్టుమార్టం నివేదికలో మృతుడి పీక పిసికి చనిపోయినట్లు ఉన్నప్పటికీ, హత్య నేరం రుజువు కాలేదు. అయితే గాయాలు కలుగజేసిన నేరం రుజువై నూప సతీష్‌కు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు.
తీర్పు అమలు:
ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. జిల్లా కోర్టు నోడల్ ఆఫీసర్ జి. ప్రవీణ్, లైజాన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ మాలోత్ ఈశ్వర్ తదితరులు సహకారం అందించారు.

Post a Comment