-->

రామగుండం పోలీస్ కమిషనరేట్‌ లో హోలీ సంబరాలు

రామగుండం పోలీస్ కమిషనరేట్‌ లో హోలీ సంబరాలు


రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. హోలీ ఉత్సవాలను పురస్కరించుకొని, పోలీస్‌ కమిషనరేట్‌కు చేరుకున్న అధికారులు, సిబ్బంది ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు.

సెలబ్రేషన్లలో భాగంగా, పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా కు ముందుగా రంగులు పూయడం జరిగింది. అనంతరం, ఆయన కూడా అధికారులకు, సిబ్బందికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, అధికారులు పరస్పరం రంగులు చల్లుకుని, ఆనందంతో నృత్యాలు చేశారు. బ్యాండ్‌ వాయిద్యాల మధ్య హోలీ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ కమిషనర్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.

సంభరాల్లో భాగంగా, చిన్న పిల్లలకు మిఠాయిలను పంపిణీ చేశారు. పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా మాట్లాడుతూ, హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాన్ని తెచ్చి, అందరి కుటుంబాలు ఆయురారోగ్యాలతో, శాంతి, సమృద్ధులతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ ఉత్సవాలు ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందించే మహత్తరమైన పండుగ అని ఆయన అన్నారు.

ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిపి ఎ. బాస్కర్ ఐపిఎస్, అడిషనల్ డిసిపి (అడ్మిన్) సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఎసిపి ఎం. రమేష్, ట్రాఫిక్ ఎసిపి నర్సింహులు, టాస్క్‌ ఫోర్స్‌ ఎసిపి మల్ల రెడ్డి, ఇన్స్‌పెక్టర్లు, ఆర్‌.ఐలు, సిసి హరీష్, ఎస్‌.ఐలు, ఆర్‌.ఎస్‌.ఐలు తదితర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ కమిషనరేట్‌ ఆవరణలో జరిగిన ఈ హోలీ సంబరాలు, క్రమశిక్షణతో పాటు ముచ్చటగా సాగాయి. రంగులతో అలరించిన కమిషనరేట్‌ కార్యాలయం, ఆనందం, ఉత్సాహంతో నిండిపోయింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793