-->

పెళ్లికి ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

 

పెళ్లికి ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్ (18) మరియు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత (20) మధ్య సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం ఏర్పడింది. కొద్దీ నెలలుగా వీరి పరిచయం ప్రేమగా మారింది.

అయితే, తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరనే భయంతో, తీవ్ర మనస్తాపానికి గురైన ఈ ప్రేమజంట ఊహించని నిర్ణయం తీసుకుంది. క్షణికావేశంలో జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్-పాపయ్యపల్లె గేట్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా యువత ఆత్మహత్యకు పాల్పడకుండా తల్లిదండ్రులు పిల్లల మనోవిభేధాలను అర్థం చేసుకోవాలని, ప్రేమను సమర్థించడంలో సున్నితంగా వ్యవహరించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793