తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది
తెలంగాణ ప్రభుత్వం రంజాన్ నెలలో వచ్చే ప్రధాన ఈద్ సంబంధిత పండుగలకు మూడు రోజులు అధికారిక సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు షబ్-ఎ-ఖదర్, జుమాతుల్-విదా, ఈద్-ఉల్-ఫితర్ పండుగలకు సంబంధించినవే.
ప్రకటించిన సెలవులు:
ఈద్ తేదీ మార్పు అవకాశం
ఈద్-ఉల్-ఫితర్ పండుగ ఖచ్చితమైన తేదీ నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది.
- మార్చి 30న నెలవంక కనబడితే, మార్చి 31న ఈద్ జరుపుకుంటారు.
- నెలవంక కనిపించకపోతే, ఏప్రిల్ 1న ఈద్ జరుపుకుంటారు.ఈద్ సెలవు తేదీ కూడా ఈ ఆధారపడి మారుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లో పండుగ రద్దీ
ఈద్ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మార్కెట్లలో కొనుగోలు జోరు కొనసాగుతోంది. చార్మినార్, లాడ్ బజార్, బేగంబజార్, నాంపల్లి, అభిడ్స్ ప్రాంతాల్లో దుకాణాలు రాత్రివేళల వరకూ తెరిచి ఉంచుతున్నారు. ప్రజలు కొత్త బట్టలు, మిఠాయిలు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ మూడు రోజులు ముస్లింలకు ముఖ్యమైన పండుగలు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థల వారు వీటిని పాటించనున్నారు. షబ్-ఎ-ఖదర్ ఐచ్ఛిక సెలవుగా ఉంటే, ఈద్-ఉల్-ఫితర్ సాధారణ సెలవుగా కొనసాగుతుంది.

Post a Comment