గాలిపల్లి స్వరూప ఇల్లందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియామకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా గాలిపల్లి స్వరూప మరోసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య కి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
స్వరూప మాట్లాడుతూ, తనను రెండవసారి ఈ పదవికి ఎంపిక చేయడంలో సహాయ సహకారాలు అందించిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డ డానియెల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి సైదులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, మహిళా కాంగ్రెస్ సభ్యులు, ఇతర కీలక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇల్లందు పట్టణ ముఖ్య నేతలు మడుగు సాంబమూర్తి, బొల్ల సూర్యం, చిల్లా శ్రీనివాస్, జెట్టి కిషోర్ పట్టణంలోని 24 వార్డుల మహిళా నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
స్వరూప తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, "ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటూ, మహిళల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తాను. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిత్యం కృషి చేస్తాను" అని తెలియజేశారు.

Post a Comment