కొత్తగూడెం మున్సిపాలిటీలో కొత్త మున్సిపల్ కమిషనర్ సుజాతకు ఘన స్వాగతం
కొత్తగూడెం మున్సిపాలిటీలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ సుజాత ని మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆమెకు బొకే అందించి, శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, బీఆర్‌ఎస్ మాజీ మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు వేముల ప్రసాద్ బాబు, బండారి రుక్మాంగాదర్ రావు, అంబుల వేణుగోపాల్ పాల్గొన్నారు. కమిషనర్ ని శుభాకాంక్షలతో సన్మానించి, ఆమె భవిష్యత్ బాధ్యతలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. కొత్త కమిషనర్ సుజాత, పట్టణ అభివృద్ధి కోసం సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.

Post a Comment