మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు
మాజీ ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎంపీ నామ నాగేశ్వరరావు పుట్టినరోజును పురస్కరించుకుని కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంటివద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కేక్ కట్ చేసి, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల అభివృద్ధికి నామ నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంటులో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన గట్టిగా తన గొంతు వినిపించారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో సూరిబాబు, ఈశ్వరి, సుమ, రాణమ్మ, ఉపేంద్ర, లక్ష్మి, చంద్రకళ, సరిత, పుల్లమ్మ, సత్యావతి, శివ, సత్తి, రోషన్, మధు, రాజు, షణ్ముఖ, కార్తిక్, వినీత్, పూర్ణ ప్రసాద్, కన్ని తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకలో పాల్గొన్న వారంతా నామ నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Post a Comment