భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ గ్రామంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రత్నకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా స్వతంత్రత, స్వయం ప్రతిపత్తిని గౌరవించడం సమాజం యొక్క బాధ్యత అని అన్నారు. మహిళలపై వివక్షను నిర్మూలించి, సమాజాన్ని సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మహిళల హక్కుల పరిరక్షణ, ఆరోగ్య హక్కులు, రక్షణ, పని గంటల తగ్గింపు కోసం పలు పోరాటాలు జరిగాయని, కానీ మహిళా దినోత్సవం కేవలం ఉత్సవంగా మారిపోతోందని, హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఇంకా ఉందని పేర్కొన్నారు.
ఆమె మాట్లాడుతూ, లింగ సమానత్వం అందరికీ అందుబాటులోకి రావాలంటే మహిళల హక్కులను హరించకుండా సమాజంలో మార్పు రావాలని, మహిళలపై జరుగుతున్న దాడులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ డాక్టర్ (ఎంఎల్ హెచ్‌బి) లతా జ్ఞానేశ్వరి, ఏఎన్ఎం మౌనిక, ఆశ వర్కర్ దేవికి లకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాంతి, గుంటి సునీత, బుజ్జమ్మ, జయ, బాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment