ఇల్లందులో ప్రత్యేక మారమ్మతులు, బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన
ఇల్లందు మండలం ఆర్ అండ్ బి రోడ్డు నుండి మామిడిగుండాల వరకు 4 కోట్ల 46 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రత్యేక మారమ్మతులు మరియు బీటీ రోడ్ రెన్యూవల్ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్.పి రోహిత్ రాజ్ హాజరై, ఈ అభివృద్ధి పనులకు తమ మద్దతును తెలిపారు.
ఈ రహదారి అభివృద్ధితో ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కలుగుతాయని, అనుసంధాన మార్గాలు మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ రహదారి పనులు పూర్తయ్యే వరకు ప్రజలు సహనంతో ఉండాలని, పనులను నాణ్యతతో, వేగంగా పూర్తిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

Post a Comment