యంగ్ ఇండియన్ సేవా పురస్కారం” అందుకున్న ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్
ఈ కార్యక్రమాన్ని యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ జె.బి. బాలు నాయక్ అధ్యక్షత వహించారు. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ బాలు నాయక్ కు ఈ అవార్డును అందజేశారు.
బాలు నాయక్ విద్యారంగంలో తన సేవలతో పాటు, ప్రకృతి పరిరక్షణలో కూడా విశేష కృషి చేస్తున్నారు. పర్యావరణ పట్ల ఆయనకున్న ప్రేమ, ప్రజల్లో ప్రజ్ఞను కలిగించే చర్యలు, మొక్కలు నాటడం, యువతలో జాగ్రత్తలు పెంపొందించే కార్యక్రమాలు మొదలైన వాటిని పురస్కరించుకొని ఈ జాతీయ పురస్కారం ఆయనకు లభించింది.
ఈ వేడుకలో ‘ద మిషన్’ ఫౌండర్, సీఐ ఏడుకొండలు, టిజిఓ జిల్లా అధ్యక్షుడు సంగం వెంకట పుల్లయ్య, కొల్లి ఫౌండేషన్ సభ్యులు కల్పన, వెంకట రెడ్డి, ఆదిత్య శ్రీరామ్, కమలాకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఇటు బాలు నాయక్ అవార్డు అందుకున్న సందర్భంగా, మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేకాధికారి టి. మధుకర్, ఏటిడిఓ చంద్రమోహన్, పాఠశాల హెచ్.ఎం. ఎల్. రామారావు, వార్డెన్, స్టాఫ్ సెక్రటరీలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు భోదేనేతర సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాలు నాయక్ కృషి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
Post a Comment