-->

23న కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

 

అర్హత కలిగిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు తక్షణమే మంజూరు చేయాలి

*కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో  వర్కర్స్ ను పెంచి పారిశుద్ధ పనులు చేపట్టాలి*

*జూన్ 20 తేది దాటినా ఎక్కడ కనిపించని మొక్కలు నాటే కార్యక్రమం* 

*దోమల నివారణ, సీజనల్ వ్యాధుల పట్ల అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి: మాజీ కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి*

ఈనెల 23న కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తెలిపారు. కొత్తగూడెం ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ నిరసన చేపడుతున్నట్లు చెప్పారు.

 కొత్తగూడెంలో అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలన్నారు. రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించాలని చెప్పారు. వర్షపు నీరు నిలిచిన చోట బ్లీచింగ్ చల్లి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని వెల్లడించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ లో వేయాలన్నారు. 

జూన్ 20వ తేదీ దాటిన కొత్తగూడెంలో ఎక్కడ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన దాఖలాలు లేవన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ హరితహారం పథకాన్ని ఓ దీక్షలాగా చేపట్టారని గుర్తు చేశారు. పరిసరాల పరిరక్షణతో పాటు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రభుత్వానికి సూచన చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793