ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన ఘనంగా వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళిక మరియు విద్యుత్ శాఖల మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు బాల శౌరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమాలలో భాగంగా ఉర్దూ ఘర్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, పలువురు పార్టీ కార్యకర్తలు, యువకులు రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరానికి స్థానిక ప్రజలు కూడా విశేషంగా స్పందించారు.
ఈ సందర్భంగా బాల శౌరి మాట్లాడుతూ, "ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సేవా కార్యక్రమాలతో ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలన్నదే మా లక్ష్యం" అన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మోతుకురి ధర్మారావు, నాగ సీతారాములు, రాజాక్ కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువజన విభాగం సభ్యులు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందరిలో ప్రశంసను అందుకుంది. ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ మొహ్మద్ గౌస్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రాజశేఖర్,ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నర్సింహారావు,కొత్తగూడెం టౌన్ యూత్ ఉపాధ్యక్షుడు ఎం.డి. ఉస్మాన్, రంజిత్ నాయుడు, షేక్. నాయిమ్, ఎస్ కె. కరీం, కొమురయ్య,దావూద్, ఏలూరి రామదాసు, నిషార్, తదితరులు పాల్గొన్నారు..

Post a Comment