పెద్దపల్లి, జమాతె ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుల నియామకాలు
జమాతె ఇస్లామీ హింద్ కేంద్రం నుండి ఇటీవల విడుదలైన ఉత్తర్వుల మేరకు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా ఎం.ఎ.హెచ్. జావెద్ మరియు మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా ఖలీల్ అహ్మద్ నియమితులయ్యారు. ఈ నియామకాలు జమాత్ యొక్క అమీర్ ఆదేశాల ప్రకారం అధికారికంగా అమలులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా, పెద్దపల్లి చరిత్రలో ఇదే మొదటిసారి ఇద్దరు పెద్దపల్లి ప్రాంతానికి చెందిన సభ్యులు, వేరే వేరే జిల్లాల అధ్యక్షులుగా నియమితులవడం గర్వకారణమని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ గొప్ప బాధ్యతను అల్లాహ్ తాయాలా వారిద్దరికీ ఇఖ్లాస్ (నిజాయితీ), హిక్మత్ (వివేకం), మరియు ఇస్తికామత్ (స్థిరత) తో నిర్వహించే శక్తిని ప్రసాదించాలని జమాత్ సభ్యులు ప్రార్థించారు.
ఇద్దరు నూతన అధ్యక్షులకూ, జమాత్ యొక్క పట్టణ శాఖ తరపున పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ. మొయీద్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే, స్థానిక సభ్యుల సంపూర్ణ మద్దతుతో వారు స్వీకరించిన ఈ కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.

Post a Comment