ఎంపీ వద్దిరాజు వివాహ వార్షికోత్సవ వేడుకలు
కొత్తగూడెం, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని శనివారం కొత్తగూడెం పట్టణంలోని స్నేహలత సంధ్యలత వృద్ధాశ్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో హృద్యంగా నిర్వహించారు. ఈ వేడుక సామాజిక సేవకు ప్రతిరూపంగా నిలిచింది.
ప్రారంభంలో సీతాలక్ష్మి, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణతో కలిసి కేక్ కట్ చేసి, ఎంపీ వద్దిరాజు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు, పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన ఆరోగ్య సూచనలను ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు వేముల ప్రసాద్ బాబు, తొగర రాజశేఖర్, మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, కాజా బక్ష్, షరీఫ్, శ్రీనివాస్, పూర్ణచందర్, జయరాం, సూరజ్, మధు, కన్ని, బాచి, MD.నిజాం, కిమ్ కుమార్, తలుగు అశోక్, అరుణ్, సమీర్, ఖదీర్, గౌస్, జానకిరాం, ప్రశాంత్, షణ్ముఖ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ఎంపీ దంపతుల సామాజిక సేవా పట్ల కట్టుబాటును చాటిచెప్పే విధంగా కొనసాగింది. వృద్ధాశ్రమ వాసులు సైతం ఈ ప్రత్యేక వేడుకలో పాల్గొనడాన్ని ఆనందంగా స్వీకరించారు.

Post a Comment