మంత్రి వివేక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి
హైదరాబాద్, తెలంగాణ మైనింగ్, కార్మిక శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామిని బుధవారం రోజున సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి హైదరాబాద్‌లోని బీఆర్‌ఎక్స్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మంత్రిని ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలిపిన ఆమె, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించారు. మైనింగ్, కార్మికుల సంక్షేమం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా ఎమ్మెల్యే రాగమయి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె సత్తుపల్లి మరియు కల్లూరు మార్కెట్ యార్డ్‌ల్లో విశ్రాంతి భవనాల ఏర్పాటుకు సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రికి అందించారు. రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సహకరించాలని ఆమె కోరారు.
పాల్వంచ నుండి శుభాకాంక్షలు
ఇక పాల్వంచకు చెందిన మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కరరావు (బాచి), మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్‌లో కలిసారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి జ్ఞాపికను బహుకరించారు. అలాగే పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కూడా శాలువాతో సత్కారం చేశారు.

Post a Comment