రూ.10,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, అటెండర్
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో జరిగిన అవినీతి ఘటన మరోసారి అధికారుల తీరు పై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఫిర్యాదుదారుని మరియు అతని కుటుంబ సభ్యుల పేర్లపై 22 గుంటల వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేసేందుకు అధికారికంగా సహాయం చేయడానికీ సంబంధించి తహసీల్దార్ రూ.10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఈ వివరాల్లోకి వెళితే... ఫిర్యాదుదారుని నుండి రూ.10,000 లంచాన్ని స్వీకరిస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ బి. నాగార్జున మరియు అదే కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ యాదగిరి ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దొరికించుకున్నారు.
ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ముందస్తు పన్నాగంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, లంచం తీసుకుంటున్న సందర్భంలోనే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు.
- వాట్సాప్ నెంబర్: 9440446106
- ఫేస్‌బుక్ పేజీ: Telangana ACB
- ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB
- వెబ్‌సైట్: acb.telangana.gov.inద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చునని తెలిపింది.
ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ACB హామీ ఇస్తోంది. ప్రజలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చి అవినీతిని ఎదిరించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.

Post a Comment