💥వెంటిలేటర్‌పై ప్రాణాపాయంగా పోరాడుతున్న ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్
తెలుగు చిత్రసీమలో తన ప్రత్యేకమైన హాస్యశైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.
వెన్కట్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు రెండు కిడ్నీలు పూర్తిగా పని చేయకపోవడంతో, అప్పటినుంచి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గత వారం రోజులుగా వెంటిలేటర్ పై ప్రాణాలతో పోరాడుతున్నారు.
వైద్య ఖర్చులు అధికమవుతున్న నేపథ్యంలో, వెంకట్ కుటుంబ సభ్యులు సహాయానికి ఎదురు చూస్తున్నారు. సినీ పరిశ్రమలో ఆయనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నప్పటికీ, ఈ సంక్షోభ సమయంలో వారు ముందుకు రావాలనే అపేక్షతో కుటుంబీకులు ఉన్నారు.
ఫిష్ వెంకట్ తన వినూత్న హావభావాలు, టైమింగ్ కామెడీతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో వెంకట్ నాటించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. కామెడీ పాత్రల్లో ఆయనది ఒక ప్రత్యేక ముద్ర.
ప్రస్తుతం ఈ వార్త వినిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. చిత్రపరిశ్రమ కూడా వెంకట్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Post a Comment