జూలై 25-27: రాష్ట్ర బాక్సింగ్ టోర్నమెంట్‌కు భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఏడుగురు క్రీడాకారులు ఎంపిక
కొత్తగూడెం, ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ షేక్‌పేటలో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఏడుగురు యువ బాక్సర్లు ఎంపికయ్యారు. తాజాగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన ఉమ్మడి జిల్లా బాక్సింగ్ ఎంపిక పోటీల్లో వీరు మెరిశారు.
జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి మట్టపర్తి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ స్టూడెంట్స్ ఏడు బంగారు పతకాలను గెలుచుకున్నారు. ఆయా కేటగిరీల్లో విజేతలు ఇలా ఉన్నారు:
ఆర్. గణేష్ – 33, 35 కేజీల విభాగం
అర్హన్ అలీ – 43, 46 కేజీలు
కే. జస్విత్ రావు – 46, 49 కేజీలు
వి. సాయికిరణ్ – 49, 52 కేజీలు
కె. అరుణ్ కృష్ణ – 55, 58 కేజీలు
కే. మదన్ – 62, 64 కేజీలు
కే. సోహిత్ చంద్ర – 70 కేజీల పైబరువు విభాగం
ఈ ప్రతిభావంతులైన క్రీడాకారులను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కోరం కనకయ్య (ఇల్లందు ఎమ్మెల్యే), జిల్లా కార్యదర్శి మట్టపర్తి రమేష్, కోచ్ ఆర్. శ్రీనివాస్, మరియు డివైఈఎస్‌ఓ ఎం. పరంధామ రెడ్డి అభినందించారు.
ఈ క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రాతినిధ్యం వహించనున్నందుకు జిల్లా క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment