-->

ప్రియుడి మోజులో సాంబారులో విషాన్ని కలిపి భర్తను హత్య చేసిన భార్య

 

ప్రియుడి మోజులో సాంబారులో విషాన్ని కలిపి భర్తను హత్య చేసిన భార్య

ధర్మపురి జిల్లా, తమిళనాడు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ భార్య తన భర్తను హత్య చేసిన ఘోర ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా అరూర్ పరిధిలోని కీరైపట్టి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు భార్యతోపాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

మృతుడు రసూల్ (35) స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య అమ్ముబీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల రసూల్ తలనొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు అతడిని సేలంలోని ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు చేసిన పరీక్షల్లో రసూల్ రక్తంలో పురుగుమందు నిలిచిన ఆనవాళ్లు గుర్తించారు. అనుమానంతో అతని భార్య అమ్ముబీ ఫోన్‌ను పరిశీలించిన కుటుంబ సభ్యులు, ఆమె స్థానికంగా సెలూన్ నిర్వహిస్తున్న లోకేశ్వరన్‌తో సంబంధం కొనసాగిస్తున్నట్లు స్పష్టమయ్యింది. వాట్సాప్ చాట్స్‌లో ఆమె, “నీవిచ్చిన విషం ముందుగా దానిమ్మ జ్యూస్‌లో కలిపాను, తాగలేదు. తరువాత సాంబారులో కలిపి తినిపించాను,” అని పేర్కొనడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ మధ్యే చికిత్స పొందుతూ రసూల్ మృతి చెందాడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన వారు, శనివారం అమ్ముబీ, లోకేశ్వరన్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

ఈ ఘటన ధర్మపురి జిల్లా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధాల నేపథ్యంతో కుటుంబంలో జరిగే ఈ తరహా హత్యలు సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి.

Blogger ఆధారితం.