-->

తూప్రాన్‌లో వీధి కుక్కల దాడి.. 25 మందికి గాయాలు!


తూప్రాన్‌లో వీధి కుక్కల దాడి.. 25 మందికి గాయాలు!

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణాన్ని వీధి కుక్కలు అతలాకుతలం చేశాయి. ఒక్కరోజే 25 మందిపై వీధికుక్కలు దాడికి పాల్పడి తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారులు ఉండగా, వారందరూ 10 ఏళ్ల లోపు వయస్సు కలవారే.

ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన అనిరుధ్ (3) అనే చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిగతా బాధితులకు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

అయితే ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నా, సంబంధిత శాఖలు స్పందించడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు బయటికి రావడానికే భయపడుతున్న పరిస్థితి నెలకొన్నది. వీధి కుక్కల నియంత్రణపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.