-->

పాల్వంచలో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం సాధన సమితి ప్రతినిధుల కలయిక

పాల్వంచలో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం సాధన సమితి ప్రతినిధుల కలయిక


హైదరాబాద్ విద్యుత్ సౌదాలో ఈరోజు ఎనిమిదవ దశ సాధన సమితి సమావేశం అట్టహాసంగా జరిగింది. ఈ సమావేశానికి చైర్మన్ సీతారాం రెడ్డి గారు అధ్యక్షత వహించగా, కన్వీనర్ మంగీలాల్ కో సమక్షంలో పాల్వంచ పట్టణంలో ఉన్న కేటీపీఎస్ పాత ప్లాంట్ ప్రాంగణంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలనే ప్రధాన లక్ష్యంతో కీలక సమావేశం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా సాధన సమితి సభ్యులు గౌరవనీయులు TG GENCO CMD హరీష్ (ఐఏఎస్) గారిని మర్యాదపూర్వకంగా కలిసి, పాల్వంచలో పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిపత్రాన్ని సమర్పించారు. ఇందుకు అనువైన భౌగోళిక, సాంకేతిక వసతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఈ ప్రతిపాదనపై స్పందించిన హరీష్ గారు, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో పర్మిషన్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సాధన సమితి ప్రతినిధులు TG GENCO డైరెక్టర్‌లు HR కుమార్ రాజ్, ధర్మల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ కమర్షియల్ డైరెక్టర్ నాగయ్య, ఇడీ డైరెక్టర్ లక్ష్మయ్యలను కలిసి పవర్ ప్రాజెక్టుపై అభిప్రాయాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో 1104 GENCO అధ్యక్షుడు కేశ బోయిన కోటేశ్వరరావు, ST అసోసియేషన్ నాయకుడు ప్రవీణ్, ఇంజినీరింగ్ అసోసియేషన్ తరపున నెహ్రూ వెంకట్ నారాయణ రెడ్డి, AITC సుమన్ వెంకటేశ్వర్లు, H82 యూనియన్ వెంపటి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ భవిష్యన్ముఖమైన ప్రాజెక్టు వల్ల పాల్వంచ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Blogger ఆధారితం.