విషాదం: తండ్రి, కొడుకును పాముకాటు – కొడుకు మృతి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బస్తీ మార్కెట్ ప్రాంతానికి చెందిన జనగాం ప్రవీణ్, ఆయన కుమారుడు వేదాంత్ గురువారం అర్ధరాత్రి సమయంలో పాముకాటుకు గురయ్యారు. సుమారు ఒకటిన్నర గంట సమయంలో ఈ సంఘటన జరిగింది.
పాముకాటు తీవ్రతతో చిన్నారి వేదాంత్ ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి ప్రవీణ్‌ను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
ఈ హఠాన్మరణంతో బస్తీ మార్కెట్ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిన్నారి మరణంపై శోకం వ్యక్తం చేస్తూ స్థానికులు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.
Post a Comment