-->

కీలక పాత్ర పోషించిన యోధుడికి సీఎం రేవంత్ రెడ్డి సత్కారం

కీలక పాత్ర పోషించిన యోధుడికి సీఎం రేవంత్ రెడ్డి సత్కారం


హైదరాబాద్‌: కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకొని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి 18 గ్రెనేడియర్స్‌కు చెందిన కార్గిల్ యుద్ధ వీరుడు కల్నల్ జాయ్ దాస్‌గుప్తా గారిని ఘనంగా సత్కరించారు.

కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న టోలోలింగ్ కొండను తిరిగి స్వాధీనం చేసుకునే కీలక ఆపరేషన్‌కు అప్పట్లో మేజర్‌గా ఉన్న జాయ్ దాస్‌గుప్తా నాయకత్వం వహించారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఆయనకు “సేనా మెడల్” లభించింది.

హైదరాబాద్‌కు చెందిన కల్నల్ దాస్‌గుప్తా తన 80 ఏళ్ల తల్లితో కలిసి ముఖ్యమంత్రి నివాసమైన జూబ్లీహిల్స్‌కి మర్యాదపూర్వకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా, రాష్ట్ర యువతను సాయుధ దళాల్లో చేరేందుకు ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి గారితో కల్నల్ దాస్‌గుప్తా సుదీర్ఘంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో లోక్‌సభ సభ్యులు డాక్టర్ మల్లు రవి కూడా పాల్గొని, కార్గిల్ యోధుడికి తన అభినందనలు తెలియజేశారు. దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వీరులను సత్కరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ముఖ్యమంత్రి అన్నారు.

Blogger ఆధారితం.