-->

ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు వినతి పత్రం ఇచ్చిన బొమ్మేర శ్రీనివాస్

ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు వినతి పత్రం ఇచ్చిన బొమ్మేర శ్రీనివాస్

ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు జడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ అంశం

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని బొమ్మెర శ్రీనివాస్ డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్సీ కులాలకు స్థానిక సంస్థలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ విన్నవించారు.

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ను శనివారం ఆయన కొత్తగూడెం నివాసంలో కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ –

“తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ కులాలకు ఉన్న రాజకీయ రిజర్వేషన్లు (జడ్పీటీసీ, ఎంపీటీసీ) తొలగించి వాటిని సాధారణ కోటాలో కలిపారు. దీని వలన లక్షలాది ఎస్సీ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కకుండా అన్యాయం జరిగింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే, అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేసి, రిజర్వేషన్లను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంలో స్పందించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ –

“ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తప్పకుండా తీసుకెళ్తాను” అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సలిగంటి కొమరయ్య, కండే రాములు, ఎనగంటి శ్రీనివాస్, కన్నం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.