గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
గోవా కొత్త గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే చేతుల మీదుగా ఉదయం 11:30 గంటలకు ఆయన రాజ్‌భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అశోక్ గజపతిరాజు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, "అశోక్ గజపతిరాజు ఈ నూతన బాధ్యతలను అంకితభావంతో, నిష్పక్షపాతంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆయనకు మరోసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.
Post a Comment