-->

కాగజ్‌నగర్‌: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

కాగజ్‌నగర్‌: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య


కాగజ్‌నగర్ పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం సుమారు 3 గంటల సమయంలో సంజీవయ్య కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఒక వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని అదే కాలనీలో నివాసముంటున్న టైలర్ ఇగురపు శ్రీనివాస్ (వయసు సుమారు 40)గా గుర్తించారు.

ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న కాగజ్‌నగర్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ కేసు విచారణ చేపట్టినట్లు సమాచారం.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Blogger ఆధారితం.