దేశంలో సంచలనం.. భారత ఉప రాష్ట్రపతి రాజీనామా
దేశ రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్ పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ సంచలన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపించారు. అనారోగ్య సమస్యల కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ముకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, 2022 ఆగష్టు 11న ఆయన ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు 1990-1991 వరకు కేంద్రమంత్రిగా, 2019 నుంచి 2022 వరకు బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. కిసాన్ పుత్రగా ఆయన దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. జనతాదళ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన గతంలో శాసనసభ, లోక్‌సభ సభ్యుడుగా కూడా పనిచేశారు.
Post a Comment