ఇంట్లో ఉరి వేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం సోమవారం విషాదంతో మిగిలింది. ఎల్లమ్మజాలు గ్రామానికి చెందిన 18 ఏళ్ల విద్యార్థిని ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
స్థానికుల సమాచారం మేరకు, దానబోయిన రాజు – లక్ష్మీల దంపతులు చిన్నకోడూరులో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు అర్చన, అఖిల, ఒక కుమారుడు ఉన్నారు. సోమవారం ఉదయం తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన సమయంలో అఖిల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment