మాజీ సీఎం అచ్యుతానందన్‌కు అశ్రునయనాల వీడ్కోలు
అళప్పుజ, కేరళ మాజీ ముఖ్యమంత్రి, దిగ్గజ కమ్యూనిస్టు నేత వి.ఎస్. అచ్యుతానందన్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ లక్షలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. 101 ఏళ్ల వయసులో సోమవారం తుదిశ్వాస విడిచిన ఆయన భౌతికకాయాన్ని బుధవారం అళప్పుజలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
వలియ చుడుకాడులోని కమ్యూనిస్టు అమర వీరుల స్మారక స్థలంలో ఆయన్ను అంతిమంగా అంతమించారు. కుమారుడు అరుణ్‌కుమార్ తండ్రికి చితి నిప్పంటించారు. అంత్యక్రియలకు ముందు తిరువనంతపురంలోని ఆయా కేంద్రాల్లో ప్రజల దర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచగా, వేలాదిగా తరలివచ్చిన ప్రజలు తమ గుండె నిండా గౌరవం, కన్నీటితో వీడ్కోలు చెప్పారు.
తిరువనంతపురం నుంచి అళప్పుజకు దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించి, వర్షాన్ని లెక్కచేయకుండా ప్రజలు ఊరేగింపుకు భారీగా హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ సాగిన ఈ అంత్యయాత్రలో ప్రజలు కిలోమీటర్ల తరబడి నిల్చుని అచ్యుతానందన్‌ను చివరిసారి చూసేందుకు వేచిచూశారు.
సీపీఎం కార్యాలయాలు, స్వగృహం వద్ద కూడా భౌతికకాయాన్ని ఉంచగా, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు అందరూ ఘన నివాళులు అర్పించారు. శ్రామిక హక్కుల కోసం జీవితాంతం పోరాడిన అచ్యుతానందన్ ప్రజల మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు.
Post a Comment