-->

రాజకీయ పార్టీలు స్కూల్ లలో పుస్తకాలు, పెన్నులు, బ్యాగ్స్ కిట్స్ పంపిణీకి నో!

రాజకీయ పార్టీలు స్కూల్ లలో పుస్తకాలు, పెన్నులు, బ్యాగ్స్ కిట్స్ పంపిణీకి నో!


జగిత్యాల, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో, పాఠశాలల్లో రాజకీయ పార్టీల కార్యకలాపాలకు ఆంక్షలు విధిస్తూ జిల్లా విద్యా అధికారి కె. రాము (ఎం.ఎ., బి.ఎడ్.) కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆర్సీ నం. 2207/ఎ1/2025 తేదీ 22.07.2025 ప్రకారం, పాఠశాలల్లో రాజకీయ పార్టీలు లేదా వ్యక్తులు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, పెన్నులు వంటి వస్తువులను పంపిణీ చేయడం అనవసరమైన రాజకీయ ప్రేరణ కలిగించే అంశమని పేర్కొన్నారు.

ఈ చర్యలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు అవకాశం ఉండే ప్రమాదం ఉందని, అందువల్ల రాజకీయ నాయకులు / వ్యక్తులను పాఠశాలల ప్రాంగణంలోకి అనుమతించకూడదని మండల విద్యాశాఖాధికారులు మరియు ప్రధానోపాధ్యాయులను జిల్లా విద్యా అధికారి స్పష్టంగా ఆదేశించారు.

పాఠశాలల కార్యకలాపాలు నిర్బంధంగా, సజావుగా కొనసాగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే, విద్యార్థుల భవిష్యత్‌తో రాజీ పడే విధంగా ఏ చర్యకూ ఆస్కారం ఇవ్వవద్దని హెచ్చరించారు.

ఈ మేరకు, జిల్లాలోని అన్ని PS, UPS పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాలలు, KGBVలు, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్స్ కు ఈ సూచనలు వెంటనే అమలులోకి తేవాలని సూచించనట్లు పేర్కొన్నారు.

Blogger ఆధారితం.