-->

పాల్వంచలో నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం

పాల్వంచలో నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం


పాల్వంచ, నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం కింద పాల్వంచ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, పాల్వంచ నందు విద్యార్థుల కోసం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన రోహిణి ఫౌండేషన్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎంహెచ్ఒ డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ, "పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఇటువంటి శిబిరాలు చాలా అవసరం. నవ లిమిటెడ్ ఈ బాధ్యతను తీసుకోవడం అభినందనీయం" అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నవ లిమిటెడ్ సిఎస్ఆర్ జనరల్ మేనేజర్ ఎం.జి.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ, పాల్వంచ పరిధిలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్స్ – పాల్వంచ, యానంబైలు, పూనుకుల, మండల పరిషత్ ఉన్నత పాఠశాలలు – వికలాంగుల కాలనీ, ఆర్సీ బంజర, శ్రీనివాస నగర్ లాంటి పాఠశాలల్లో మొత్తం 1100 మందికి పైగా విద్యార్థులకు దంత పరీక్షలు మరియు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

రోహిణి ఫౌండేషన్ డాక్టర్ అలేఖ్య మాట్లాడుతూ, “రూరల్ కేర్ – ఐరన్ హెల్తీ చైల్డ్” కార్యక్రమం కింద విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో ఈ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నవ లిమిటెడ్ జీఎం బి. రామారావు, పాఠశాల హెచ్‌ఎం రమ, మొబైల్ సైన్స్ యూనిట్ సిబ్బంది రాజేశ్వరరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు శిబిరంలో చురుకుగా పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.

Blogger ఆధారితం.