-->

దుక్కి దున్నిన ఎస్సై...! రైతు మానసులోంచి విరబూసిన మమతా మనుసు

 

దుక్కి దున్నిన ఎస్సై...! రైతు మానసులోంచి విరబూసిన మమతా మనుసు

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం: రైతు మనసు ఎప్పుడు కూడా నలుగురినీ ఆదుకునేలా ఉంటుంది. అదే మనసు వృత్తి మారినా మారదు. ఇందుకు నిదర్శనంగా నిలిచారు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో రెండో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న లింగారెడ్డి.

గూడూరులో విధులు ముగించుకుని తిరిగి పోలీస్ స్టేషన్‌కు వస్తుండగా మార్గమధ్యంలో ఓ పత్తి చేనులో ఎద్దులతో దుక్కి దున్నుతున్న రైతును గమనించారు. వెంటనే వాహనాన్ని ఆపి, తాను కూడా ఓ రైతునే అని, వ్యవసాయం అంటే అపారమైన మమకారం తనకు ఉందని మనసులో ఉప్పొంగిన భావాలతో తానే స్వయంగా దుక్కి పట్టారు.

అప్పుడే ఆ రైతు ఆశ్చర్యంతో, “మీకు కూడా ఈ పని వచ్చా సార్?” అని ప్రశ్నించగా, "రైతుగా పుట్టినవాడిని, ఇది నాకు కొత్త కాదు," అంటూ చిరునవ్వు చిందిస్తూ తన లోని రైతు స్ఫూర్తిని చాటిచెప్పారు లింగారెడ్డి.

ఈ దృశ్యం చూ‌సిన పలువురు స్థానికులు ఆయనను అభినందిస్తూ, “వారిలోని మానవత్వం, రైతును గుర్తు చేసుకున్న ఆత్మీయత చాలా గొప్ప విషయం” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Blogger ఆధారితం.