-->

బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి: మల్లు భట్టి విక్రమార్క డిమాండ్

 

బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి: మల్లు భట్టి విక్రమార్క డిమాండ్

హైదరాబాద్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలన్నది ఆయన విజ్ఞప్తి.

మంగళవారం సచివాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో భట్టి మాట్లాడుతూ, అన్ని పార్టీల ఎంపీల మద్దతును పొందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి బృందంగా వెళ్తున్నట్టు తెలిపారు.

పంచాయతీరాజ్‌ శాఖలో 50% రిజర్వేషన్ పరిమితి ఉన్న నేపథ్యంలో, భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందన్నారు. ఆ ఆర్డినెన్స్‌కి గవర్నర్ ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


"లీగల్ నోటీసులకు భయపడను": భట్టి స్పందన

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్లు రామచందర్ రావు ఇచ్చిన లీగల్ నోటీసులపై స్పందించిన భట్టి, “నేను చేసిన వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత వహిస్తాను. లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తిని కాదు. సమయం వచ్చినప్పుడు పార్టీతో పాటు, వ్యక్తిగతంగా కూడా స్పందిస్తాను,” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Blogger ఆధారితం.