-->

కొత్తగూడెం కోర్టు చెక్కు బౌన్స్ కేసులో క్రిమినల్ అప్పీల్ కొట్టివేత

కొత్తగూడెం కోర్టు చెక్కు బౌన్స్ కేసులో క్రిమినల్ అప్పీల్ కొట్టివేత


కొత్తగూడెం, (లీగల్): చెక్కు బౌన్స్ కేసులో దాఖలైన క్రిమినల్ అప్పీల్‌ను కొట్టివేస్తూ, కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం కీలక తీర్పు వెల్లడించారు.

పాల్వంచ కాంట్రాక్టర్స్ కాలనీకి చెందిన గంటిటి కృష్ణ, వినాయక ఎంటర్ప్రైజెస్ తరఫున పాల్వంచకు చెందిన మిరియాల అలివేలుతో 2011 మార్చి 7న ఐదు లక్షల రూపాయల రోక్కాము తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో అలివేలు డిమాండ్ చేయగా, 2013 అక్టోబర్ 3న కృష్ణ రూ.7 లక్షల చెక్కును జారీ చేశాడు. అయితే, చెక్కును బ్యాంకులో జమ చేయగా అది బౌన్స్ అయింది.

దీంతో మిరియాల అలివేలు లాయర్ నోటీసు పంపినా, కృష్ణ నుంచి స్పందన రాకపోవడంతో చెక్కు బౌన్స్ కేసు దాఖలు చేశారు. విచారణ అనంతరం, అప్పటి రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం. నీలిమ, 2021 ఆగస్టు 31న తీర్పు వెలువరించారు. కృష్ణకు ఒక సంవత్సరపు కారాగార శిక్షతో పాటు రూ.14 లక్షల చెల్లింపుని ఆదేశించారు.

ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కృష్ణ జిల్లా ప్రధాన న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, కింద కోర్టు తీర్పును సమర్థించుతూ అప్పీల్‌ను కొట్టివేశారు.

మిరియాల అలివేలు తరఫున న్యాయవాది లక్కినేని సత్యనారాయణ బృందం వాదనలు వినిపించారు.

Blogger ఆధారితం.