కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలకు వరద హెచ్చరిక
కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలకు వరద హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం, (తాజా సమాచారం): జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాల సూచనల నేపథ్యంలో కిన్నెరసాని డ్యాం నుండి ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తి వరదనీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం కిన్నెరసాని రిజర్వాయర్‌లో నీటిమట్టం 403.70 అడుగుల వద్ద నమోదైందని అధికార వర్గాలు వెల్లడించాయి. వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలు ఈ రోజు (24.07.2025) వ్యవసాయ పనుల కోసం గానీ, ఇతర అవసరాల కోసం గానీ నదిని దాటి ప్రయాణించరాదని విజ్ఞప్తి చేశారు.
“ప్రాణాలు మించిన అవసరాలు ఏవీ లేవు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి” అని కిన్నెరసాని ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజనీర్ హెచ్చరించారు.
Post a Comment