-->

విమాన ప్రమాద అనుమానం: చైనాకు బయలుదేరిన అంగారా ఎయిర్‌లైన్స్ విమానం ఆచూకీ తప్పింది

విమాన ప్రమాద అనుమానం: చైనాకు బయలుదేరిన అంగారా ఎయిర్‌లైన్స్ విమానం ఆచూకీ తప్పింది


రష్యాకు చెందిన అంగారా ఎయిర్‌లైన్స్కు చెందిన ఓ ప్రయాణికుల విమానం చైనాలోని ఆముర్ ప్రాంతంలోని టిండా నగరానికి బయలుదేరింది. అయితే గమ్యస్థానానికి చేరువలోకి రాగానే ఆ విమానం కమ్యూనికేషన్‌తో సంబంధం కోల్పోయింది.

విమానానికి చివరిసారిగా సిగ్నల్ వచ్చిన చోటు టిండా నగరానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత విమానం ఎలాంటి సమాచారాన్నీ పంపకపోవడం, రాడార్‌కు చిక్కకపోవడం నేపథ్యంలో ప్రమాదాన్ని అనుమానిస్తున్నారు.

విమానానికి ఏమైంది? ప్రస్తుతం ఆ విమానం ఎక్కడో కుప్పకూలిపోయి ఉండొచ్చని స్థానిక వర్గాలు భావిస్తున్నాయి. సంబంధిత అధికారులు, రక్షణ బృందాలు శోధన చర్యలను ప్రారంభించాయి. విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ ఘటనపై సంబంధిత దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. త్వరలోనే పూర్తి సమాచారం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Blogger ఆధారితం.